ఓపెన్ సోర్స్ గోప్యత సాంకేతికత ద్వారా స్వేచ్ఛాయుత వ్యక్తీకరణను రక్షించండి మరియు సురక్షితమైన భౌగోళిక కమ్యూనికేషన్‌ను ప్రారంభించండి.
మా ఫ్లాగ్షిప్ ఉత్పత్తి, Signal మెసెంజర్‌తో, యూజర్ గోప్యతను కాపాడటంలో విజేత కావడం అంటే మీ డేటాను "బాధ్యతాయుతంగా" నిర్వహించడం కంటే, మాతో సహా, ఎవరి చేతుల నుంచి అయినా దూరంగా ఉంచడం అని మేము నమ్ముతున్నాము.
ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో నిబద్ధత కలిగిన సభ్యుడిగా, మేము మా సాంకేతికతను ప్రచురిస్తాము మరియు ఇతర కంపెనీలను వారి స్వంత ఉత్పత్తులు మరియు సేవలలో దానిని స్వీకరించేలా ప్రోత్సహించడానికి జ్ఞానాన్ని పంచుకుంటాం.
Signal ఫౌండేషన్ ఒక 501c3 లాభాపేక్ష లేనిది. మేము ఆ హోదాకు గర్విస్తున్నాము మరియు లాభాపేక్ష లేని సంస్థ లాభ ప్రయోజనంతో నడిచే ఏదైనా వ్యాపారం కన్నా వినూత్నంగా మరియు కొలబద్ధగా నిలవగలదు అని నిరూపించడానికి మేము బయలుదేరాము.
2012 లో ఆవిర్భవించిన Signal మెసెంజర్‌కు మద్దతు ఇవ్వడానికి Signal ఫౌండేషన్ 2018 లో ఏర్పాటు చేయబడింది. ఫౌండేషన్ ద్వారా, మేము Signal యొక్క ఎదుగుదల మరియు కొనసాగుతున్న కార్యకలాపాలకు మద్దతు ఇవ్వగలిగాము అలాగే ప్రైవేట్ కమ్యూనికేషన్ యొక్క భవిష్యత్తును పరిశోధించగలిగాము.
Signal ప్రకటనదారులు లేదా పెట్టుబడిదారులు లేని లాభాపేక్ష లేని సంస్థ, దానిని ఉపయోగించే మరియు దానికి విలువను ఇచ్చే వ్యక్తుల ద్వారా మాత్రమే మనుగడ సాగిస్తోంది.
మేము Signal ఫౌండేషన్‌ను Signal మెసెంజర్ యొక్క మాతృసంస్థగా ఏర్పాటు చేశాము ఎందుకంటే అదే లక్ష్యానికి నిచ్చెనగా ఉండే ఇతర గోప్యతను పరిరక్షించే ప్రాజెక్టులను ఒకరోజున ప్రోత్సహించాలని మేము ఆకాంక్షిస్తున్నాము.
ప్రపంచవ్యాప్తంగా ఉండే మిలియన్ల మందికి ఉచిత యాప్‌గా Signal ను అందించడానికి మేం కమ్యూనిటీ యొక్క మద్దతుపై ఆధారపడ్డాము. మీరు లక్ష్యానికి మద్దతు ఇస్తారా?
దశాబ్దానికి పైగా ట్రాన్స్-నేషనల్ నైపుణ్యంతో ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, పౌర సమాజ సంస్థలు మరియు దాతృత్వాలకు సలహా ఇస్తున్న అంబ కక్ ఒక న్యాయవాది మరియు సాంకేతిక విధాన నిపుణురాలు. ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లోని ప్రముఖ విధాన పరిశోధన సంస్థ అయిన AI నౌ ఇన్స్టిట్యూట్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలోగా ఉన్నారు.
యు.ఎస్. ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌లో సీనియర్ సలహాదారుగా పనిచేసిన అంబ కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతిక సమస్యలపై రెగ్యులేటర్‌కు ఆమె సలహాలు ఇచ్చారు. AI నౌకు ముందు, అంబ Mozilla లో గ్లోబల్ విధాన సలహాదారుగా ఉన్నారు, అక్కడ ఆమె ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరియు వెలుపల డేటా గోప్యతా చట్టాలు మరియు నెట్వర్క్ తటస్థత వంటి సమస్యలపై సంస్థ యొక్క స్థానాలను రూపకల్పన చేసి, వాటిని అభివృద్ధి చేశారు. ఆమె ప్రస్తుతం Mozilla ఫౌండేసన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కార్యక్రమ కమిటీలో ఉన్నారు. అంబ భారతదేశంలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్ నుంచి BA LLB (హానర్స్) ను పొందారు. ఆమె మాస్టర్స్ ఇన్ లా (BCL) మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి సోషల్ సైన్స్ ఆఫ్ ద ఇంటర్నెట్లో MSc పొందారు, రోడ్స్ స్కాలర్‌గా ఆమె వీటికి హాజరయ్యారు.
బ్రియాన్ ఆక్టన్ ఒక వ్యవస్థాపకుడు మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్, అతను 2009 లో మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను సహ-స్థాపించారు. 2014 లో యాప్ ఫేస్‌బుక్‌కు విక్రయించబడిన తరువాత, కస్టమర్ డేటా వాడకం చుట్టూ ఉన్న విభేదాల కారణంగా ఆక్టన్ సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు మరియు లాభాపేక్ష లేని వెంచర్లపై తన ప్రయత్నాలను కేంద్రీకరించడానికి ప్రకటనలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఫిబ్రవరి 2018 లో, మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో కలిసి Signal ఫౌండేషన్‌ను ప్రారంభించడానికి ఆక్టన్ తన సొంత డబ్బులో 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాడు. Signal ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ, ఇది ప్రైవేట్ కమ్యూనికేషన్‌ను యాక్సెస్ చేసుకోదగిన, సురక్షితమైన మరియు సర్వవ్యాప్తకం చేయడం చుట్టూ పునాది పని చేయడానికి అంకితమైంది.
వాట్సాప్, Signal ఫౌండేషన్ స్థాపించడానికి ముందు ఆక్టన్ యాపిల్, యాహూ, మరియు అడోబ్ లాంటి కంపెనీలలో 25 సంవత్సరాలకు పైగా సాఫ్ట్వేర్ బిల్డర్‌గా పనిచేశాడు.
జే వినియోగదారు సాంకేతికతలో సీనియర్ ప్రొడక్ట్ మరియు ఇంజనీరింగ్ నాయకత్వ పాత్రల్లో విస్తృత నేపథ్యం ఉన్న ఒక ప్రొడక్ట్ బిల్డర్. ఇటీవల, ఆయన Twitter కన్స్యూమర్ అండ్ రెవెన్యూ ప్రొడక్ట్స్, ప్రముఖ ఇంజనీరింగ్, ప్రొడక్ట్, డిజైన్, రీసెర్చ్ అండ్ డేటా సైన్స్ యొక్క జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. Twitter కు ముందు, జే Facebook లో ఉన్నారు, అక్కడ ఆయన రియాలిటీ ల్యాబ్ యొక్క AI అసిస్టెంట్ అభివృద్ధికి నాయకత్వం వహించారు మరియు ఆ తరువాత మెసెంజర్ మరియు Instagram డైరెక్ట్ కోసం గోప్యత, సమగ్రత మరియు సిస్టమ్స్ ప్రొడక్ట్ బృందాలకు నాయకత్వం వహించారు. జే Mozilla లో ప్రొడక్ట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యొక్క SVP గా ఉన్నారు, అక్కడ దాని ఎదుగుదల సమయంలో Firefox ప్రధాన విడుదలలకు నాయకత్వం వహించారు మరియు వెబ్ ఫ్లాట్‌ఫారమ్‌కు మరియు ఆన్లైన్లో ప్రజలకు మరిన్ని ఎంపికలు మరియు నియంత్రణ అందించడానికి ప్రచారకుడిగా ఉన్నారు.
జే ఒక స్టార్టప్ స్థాపకుడుగా కూడా ఉన్నారు, మరియు తన కెరీర్ తొలినాళ్లలో Firefly నెట్వర్క్ (Microsoft చే కొనుగోలు చేయబడింది) మరియు Oracle లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు ఇంజనీరింగ్ మేనేజర్‌గా పని చేశారు.
జే యేల్ కాలేజీ నుండి అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో B.S. పట్టా పొందారు మరియు అనేక యునైటెడ్ స్టేట్స్ పేటెంట్లకు సహ-ఆవిష్కర్త.
కేథరిన్ మహెర్ Wikipedia కు బాధ్యత వహించే Wikimedia ఫౌండేషన్ మాజీ CEO మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆమె ప్రస్తుతం అట్లాంటిక్ కౌన్సిల్లో నాన్ రెసిడెంట్ సీనియర్ ఫెలోగా ఉన్నారు, ఇక్కడ ఆమె పని సాంకేతికత, మానవ హక్కులు మరియు ప్రజాస్వామ్యాల కలయికపై దృష్టి పెడతారు. Wikimedia కు ముందు ఆమె డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌకు అడ్వకసీ డైరెక్టర్‌గా ఉన్నారు. మహెర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్ అయిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో టర్మ్ మెంబర్, ట్రూమన్ నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లో సెక్యూరిటీ ఫెలోగా ఉన్నారు. ఆమె సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డెమోక్రసీ, కన్స్యూమర్ రిపోర్ట్స్, డిజిటల్ పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ అమెరికా, అడ్వెంచర్ సైంటిస్ట్స్ మరియు System.com డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు, అలాగే అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్ ట్రస్టీగా ఉన్నారు. ఆమె U.S. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ విదేశీ వ్యవహారాల పాలసీ బోర్డులో నియమిత సభ్యురాలిగా ఉన్నరు, ఇక్కడ ఆమె సాంకేతిక విధానంపై స్టేట్ సెక్రటరీకి సలహాలు ఇస్తారు. ఈజిప్టులోని కైరోలోని అమెరికన్ యూనివర్శిటీకి చెందిన అరబిక్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్, సిరియాలోని డమాస్కస్‌లోని Institut français d'études arabes de Damas (L'IFEAD) లో చదివిన తరువాత ఆమె 2005 లో న్యూయార్క్ యూనివర్సిటీ యొక్క కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుండి మిడిల్ ఈస్టర్న్ అండ్ ఇస్లామిక్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
మెరెడిత్ విట్టేకర్ Signal యొక్క అధ్యక్షురాలు మరియు Signal ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సభ్యురాలు.
ఆమెకు టెక్, విస్తరణచేసే పరిశ్రమ, విద్యారంగం మరియు ప్రభుత్వంలో 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. Signal లో అధ్యక్షురాలిగా చేరడానికి ముందు, ఆమె NYU లో మిండెరూ రీసెర్చ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు మరియు ఆమె సహ-స్థాపించిన AI Now ఇనిస్టిట్యూట్‌కు ఫ్యాకల్టీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆమె పరిశోధన మరియు పాండిత్య పని గ్లోబల్ AI విధానాన్ని రూపొందించడానికి మరియు ఆధునిక AI కు అవసరమైన నిఘా వ్యాపార పద్ధతులు మరియు పారిశ్రామిక వనరుల కేంద్రీకరణను బాగా గుర్తించడానికి AI పై ప్రజా కథనాన్ని మార్చడానికి సహాయపడ్డాయి. NYU కు ముందు, ఆమె గూగుల్‌లో దశాబ్దానికి పైగా పనిచేశారు, అక్కడ ఆమె అత్పత్తి మరియు ఇంజనీరింగ్ బృందాలకు నాయకత్వం వహించారు, గూగుల్ యొక్క ఓపెన్ రీసెర్చ్ బృందాన్ని స్థాపించారు, మరియు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడిన నెట్వర్క్ లెక్కింపు ఫ్లాట్‌ఫారమ్ అయిన M-Lab ను సహ-స్థాపన చేశారు, ఇది ఇప్పుడు ఇంటర్నెట్ పనితీరుపై ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ డేటాను అందిస్తుంది. ఆమె గూగుల్‌లో నిర్వహించేందుకు నాయకత్వం వహించడంలో కూడా సహాయపడ్డారు. AI మరియు దాని హాని గురించి ఆందోళనలకు కంపెనీ యొక్క సరిపోని ప్రతిస్పందినకు వ్యతిరేకంగా ఒప్పుకోని ప్రధాన నిర్వాహకులలో ఆమె ఒకరు, మరియు గూగుల్ నిష్క్రమణ యొక్క కేంద్ర నిర్వాహకురాలు. గోప్యత, భద్రత, కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ విధానం మరియు కొలమానంపై వైట్ హౌస్, FCC, న్యూయార్క్ నగరం, యూరోపియన్ పార్లమెంట్ మరియు అనేక ఇతర ప్రభుత్వాలు మరియు పౌర సమాజ సంస్థలకు ఆమె సలహా ఇచ్చారు. మరియు ఆమె ఇటీవలే యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చైర్మెన్‌కు AI పై సీనియర్ సలహాదారుగా పదవీకాలాన్ని పూర్తి చేశారు.
మోక్సీ మార్లిన్స్పైక్ Signal యొక్క వ్యవస్థాపకుడు.