స్వేచ్ఛా వ్యక్తీకరణను సంరక్షించే మరియు సురక్షితమైన గ్లోబల్ కమ్యూనికేషన్‌ను ప్రారంభించే ఓపెన్ సోర్స్ గోప్యతా సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది.

మా లక్ష్యం

స్వేచ్ఛా వ్యక్తీకరణను సంరక్షించే మరియు సురక్షితమైన గ్లోబల్ కమ్యూనికేషన్‌ను ప్రారంభించే ఓపెన్ సోర్స్ గోప్యతా సాంకేతికతను అభివృద్ధి చేయడం.

గోప్యత మొదట

మా ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి, Signal మెసెంజర్‌తో, యూజర్ గోప్యతను కాపాడటంలో విజేత కావడం అంటే మీ డేటాను "బాధ్యతాయుతంగా" నిర్వహించడం కంటే, మాతో సహా, ఎవరి చేతుల నుంచి అయినా దూరంగా ఉంచడం అని మేము నమ్ముతున్నాము.

ఓపెన్ సోర్స్

ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో నిబద్ధత కలిగిన సభ్యుడిగా, మేము మా సాంకేతికతను ప్రచురిస్తాము మరియు ఇతర కంపెనీలను వారి స్వంత ఉత్పత్తులు మరియు సేవలలో దానిని స్వీకరించేలా ప్రోత్సహించడానికి జ్ఞానాన్ని పంచుకుంటాం.

లాభాపేక్ష లేనిది

Signal ఫౌండేషన్ ఒక 501c3 లాభాపేక్ష లేనిది. మేము ఆ హోదాకు గర్విస్తున్నాము మరియు లాభాపేక్ష లేని సంస్థ లాభ ప్రయోజనంతో నడిచే ఏదైనా వ్యాపారం కన్నా వినూత్నంగా మరియు కొలబద్ధగా నిలవగలదు అని నిరూపించడానికి మేము బయలుదేరాము.

ఫౌండేషన్ + LLC నిర్మాణం ఎందుకు?

మేము Signal ఫౌండేషన్‌ను Signal మెసెంజర్ యొక్క మాతృసంస్థగా ఏర్పాటు చేశాము ఎందుకంటే అదే లక్ష్యానికి నిచ్చెనగా ఉండే ఇతర గోప్యతను పరిరక్షించే ప్రాజెక్టులను ఒకరోజున ప్రోత్సహించాలని మేము ఆకాంక్షిస్తున్నాము.

అందరికీ ఉచితం

ప్రపంచవ్యాప్తంగా ఉండే మిలియన్ల మందికి ఉచిత యాప్‌గా Signal ను అందించడానికి మేం కమ్యూనిటీ యొక్క మద్దతుపై ఆధారపడ్డాము. మీరు లక్ష్యానికి మద్దతు ఇస్తారా?

ఫౌండేషన్ + LLC నిర్మాణం ఎందుకు?

మేము Signal ఫౌండేషన్‌ను Signal మెసెంజర్ యొక్క మాతృసంస్థగా ఏర్పాటు చేశాము ఎందుకంటే అదే లక్ష్యానికి నిచ్చెనగా ఉండే ఇతర గోప్యతను పరిరక్షించే ప్రాజెక్టులను ఒకరోజున ప్రోత్సహించాలని మేము ఆకాంక్షిస్తున్నాము.

అందరికీ ఉచితం

ప్రపంచవ్యాప్తంగా ఉండే మిలియన్ల మందికి ఉచిత యాప్‌గా Signal ను అందించడానికి మేం కమ్యూనిటీ యొక్క మద్దతుపై ఆధారపడ్డాము. మీరు లక్ష్యానికి మద్దతు ఇస్తారా?

బోర్డు సభ్యులు

బ్రియాన్ ఆక్టన్ యొక్క మూర్తిచిత్రం

Brian Acton

బ్రియాన్ ఆక్టన్ ఒక వ్యవస్థాపకుడు మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్, అతను 2009 లో మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను సహ-స్థాపించారు. 2014 లో యాప్ ఫేస్‌బుక్‌కు విక్రయించబడిన తరువాత, కస్టమర్ డేటా వాడకం చుట్టూ ఉన్న విభేదాల కారణంగా ఆక్టన్ సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు మరియు లాభాపేక్ష లేని వెంచర్లపై తన ప్రయత్నాలను కేంద్రీకరించడానికి ప్రకటనలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఫిబ్రవరి 2018 లో, మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో కలిసి Signal ఫౌండేషన్‌ను ప్రారంభించడానికి ఆక్టన్ తన సొంత డబ్బులో 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాడు. Signal ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ, ఇది ప్రైవేట్ కమ్యూనికేషన్‌ను యాక్సెస్ చేసుకోదగిన, సురక్షితమైన మరియు సర్వవ్యాప్తకం చేయడం చుట్టూ పునాది పని చేయడానికి అంకితమైంది.

వాట్సాప్, Signal ఫౌండేషన్ స్థాపించడానికి ముందు ఆక్టన్ యాపిల్, యాహూ, మరియు అడోబ్ లాంటి కంపెనీలలో 25 సంవత్సరాలకు పైగా సాఫ్ట్‌వేర్ బిల్డర్‌గా పనిచేశాడు.

మోక్సీ మార్లిన్‌స్పైక్ యొక్క మూర్తిచిత్రం

Moxie Marlinspike

మోక్సీ మార్లిన్‌స్పైక్ Signal యొక్క వ్యవస్థాపకుడు.

మెరెడిత్ విట్టేకర్ యొక్క మూర్తిచిత్రం

Meredith Whittaker

మెరెడిత్ విట్టేకర్ Signal యొక్క అధ్యక్షురాలు మరియు Signal ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సభ్యురాలు.

ఆమెకు టెక్, విస్తరణచేసే పరిశ్రమ, విద్యారంగం మరియు ప్రభుత్వంలో 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. Signal లో అధ్యక్షురాలిగా చేరడానికి ముందు, ఆమె NYU లో మిండెరూ రీసెర్చ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు మరియు ఆమె సహ-స్థాపించిన AI Now ఇనిస్టిట్యూట్‌కు ఫ్యాకల్టీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆమె పరిశోధన మరియు పాండిత్య పని గ్లోబల్ AI విధానాన్ని రూపొందించడానికి మరియు ఆధునిక AI కు అవసరమైన నిఘా వ్యాపార పద్ధతులు మరియు పారిశ్రామిక వనరుల కేంద్రీకరణను బాగా గుర్తించడానికి AI పై ప్రజా కథనాన్ని మార్చడానికి సహాయపడ్డాయి. NYU కు ముందు, ఆమె గూగుల్‌లో దశాబ్దానికి పైగా పనిచేశారు, అక్కడ ఆమె అత్పత్తి మరియు ఇంజనీరింగ్ బృందాలకు నాయకత్వం వహించారు, గూగుల్ యొక్క ఓపెన్ రీసెర్చ్ బృందాన్ని స్థాపించారు, మరియు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడిన నెట్‌వర్క్ లెక్కింపు ఫ్లాట్‌ఫారమ్ అయిన M-Lab ను సహ-స్థాపన చేశారు, ఇది ఇప్పుడు ఇంటర్నెట్ పనితీరుపై ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ డేటాను అందిస్తుంది. ఆమె గూగుల్‌లో నిర్వహించేందుకు నాయకత్వం వహించడంలో కూడా సహాయపడ్డారు. AI మరియు దాని హాని గురించి ఆందోళనలకు కంపెనీ యొక్క సరిపోని ప్రతిస్పందినకు వ్యతిరేకంగా ఒప్పుకోని ప్రధాన నిర్వాహకులలో ఆమె ఒకరు, మరియు గూగుల్ నిష్క్రమణ యొక్క కేంద్ర నిర్వాహకురాలు. గోప్యత, భద్రత, కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ విధానం మరియు కొలమానంపై వైట్ హౌస్, FCC, న్యూయార్క్ నగరం, యూరోపియన్ పార్లమెంట్ మరియు అనేక ఇతర ప్రభుత్వాలు మరియు పౌర సమాజ సంస్థలకు ఆమె సలహా ఇచ్చారు. మరియు ఆమె ఇటీవలే యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చైర్మెన్‌కు AI పై సీనియర్ సలహాదారుగా పదవీకాలాన్ని పూర్తి చేశారు.